Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతి..

Gyanvapi Mosque: ఈ నెల 31 వరకు ASI సర్వే పూర్తి చేయాలని ఆదేశం

Update: 2023-07-26 12:26 GMT

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతి.. 

Gyanvapi Mosque: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ASI సర్వేకు అలహాబాద్ హైకోర్ట్ అనుమతి మంజూరు చేసింది. జూలై 31 లోగా సర్వే పూర్తి చేయాలని కోర్టు డెడ్‌లైన్‌ విధించింది. అలాగే కట్టడానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా సర్వే చేయాలని తెలిపింది. కాగా.. జ్ఞానవాపి మసీదును ఓ ఆలయంపై నిర్మించారా అనే విషయంపై సర్వే నిర్వహించాలంటూ ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను జిల్లా కోర్టు ఆదేశించింది. అయితే దీనిపై అంజుమన్ ఇంతెజామియా మసీద్‌.. అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ASI సర్వేకు అనుమతించింది.

Tags:    

Similar News