Delhi Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్

*ఢిల్లీలో దారుణంగా మారుతున్న పరిస్థితులు

Update: 2021-11-04 14:30 GMT

ఢిల్లీలో దారుణంగా మారుతున్న పరిస్థితితులు

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీని పట్టిపీడిస్తోన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడంలేదు. కాలుష్యానికి కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం వాయు కాలుష్య కారకులకు గరిష్ఠంగా ఐదేళ్ల జైలు, కోటి వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంది. అయితే, తాజాగా దీపావళీ పర్వదినాన్ని పురస్కరించుకుని బాణాసంచా పేలుళ్ల కారణంగా మరోసారి వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగింది.

ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ పేలవంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీపావళి పండుగ నేపథ్యం సూచీ మరింత దిగజారే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 352 నమోదైంది. అలాగే చాలా ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 8 గంటల వరకు గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. రేపటికి మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడింది.

Tags:    

Similar News