Air India Servers Hacked: ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్.

Air India Servers Hacked: ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైందని ఎయిర్ ఇండియా వెల్లడించింది.

Update: 2021-05-22 03:11 GMT

Air India 

Air India Servers Hacked: మీరు ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేశారా.. అందులో టిక్కెట్ మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో కొన్నారా.. అయితే మీ అకౌంట్స్ ప్రమాదంలో పడినట్లే. అవును ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్ అయ్యాయి. భారీ స్థాయిలో దాదాపు 45 లక్షల మంది ప్రయాణీకులకు చెందిన డేటా దొంగిలించబడింది. దీంతో అందరూ టెన్షన్ లో పడ్డారు. కాకపోతే కొసమెరుపు ఏంటంటే పాస్ వర్డులు చోరీకి గురి కాలేదని..వాటిని వెంటనే రీసెట్ చేశామని ఎయిర్ ఇండియా కవరింగ్ ఇస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురైందని ఎయిర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. ప్రయాణికులకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్టు, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ తదితర వివరాలన్నీ లీకైనట్లు ప్రకటించింది. డేటా చోరీకి గురైన వారిలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారని పేర్కొంది. 2011 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలానికి సంబంధించిన డేటా హ్యాకింగ్ జరిగినట్టు నిర్ధారించారు.

హ్యాకింగ్ జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. వెంటనే ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యామని ఎయిర్ ఇండియా తెలిపింది. వెంటనే డేటా భద్రతకు సంబంధించిన పాస్‌వర్డ్స్ ను రీసెట్ చేసినట్లు తెలిపింది.

Tags:    

Similar News