LCH Helicopters: నేడు వాయుసేనలోకి ఎల్‌సీహెచ్ హెలికాప్టర్లు
LCH Helicopters: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హెలికాప్టర్లు
LCH Helicopters: భారత వాయుసేనలోకి తేలికపాటి చాపర్లు చేరనున్నాయి. ఇవాళ రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. ఇవీ తేలికపాటి హెలికాప్టర్లు అని.. దీనికి సంబంధించి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇవీ ఐఏఎఫ్‌కు బూస్ట్ ఇచ్చే అంశం అని ఆయన తెలిపారు. తేలికపాటి విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేశాయి. 5.8 టన్నుల బరువున్న ఈ హెలికాప్టర్‌లో రెండు ఇంజిన్లు ఉన్నాయి. ఇవీ ఎలాంటి పరిస్థితులోనైనా పనిచేయగలవు.
ఈ విమానాలు 5 వేల అడుగుల ఎత్తులో కూడా ఆయుధాలు, ఇంధనం అందించగలవు. తేలికపాటి విమానాలు కావడంతో వేగంగా దాడి చేయగలవని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.నిర్దేశిత ఎత్తులో, 24 గంటలు పనిచేసే సామర్థ్యం ఈ హెలికాప్టర్ల సొంతం. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొగలుగుతాయని వైమానిక దళం చెబుతుంది. భారత వైమానిక దళం, భారత సైన్యం అవసరాలను తీర్చడానికి ఇవి చక్కగా పనిచేస్తాయని విశ్లేషిస్తోంది. ఈ తేలికపాటి విమానాలు ఐఏఎఫ్‌లో చేరికతో వాయుసేన మరింత బలోపేతం కానుంది.