Coronavirus: కరోనా మృతులపై ఎయిమ్స్ కీలక అధ్యయనం
Coronavirus: కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు కుటుంబీకులు భయపడుతున్న వేళ ఎయిమ్స్ గుడ్ న్యూస్
Coronavirus: కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు కుటుంబీకులు భయపడుతున్న వేళ ఎయిమ్స్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో బాధపడుతూ చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12-24 గంటల తర్వాత కరోనా వైరస్ బతకలేదని తెలిపారు. ఈ విషయమై ఏడాది కాలంగా ఎయిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫొరెన్సిక్ మెడిసిన్ అధ్యయనం చేస్తోందని వివరించారు. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన మెడికో-లీగల్ కేసులను పరీక్షించడం ద్వారా ఈ విషయాలను గుర్తించినట్లు తెలిపారు.
అయితే అంత్యక్రియల్లో పాల్గొనే వారు ముందస్తు రక్షణగా కచ్చితంగా మాస్క్‌లు, చేతికి గ్లౌవ్స్, పీపీఈ కిట్లు ధరించాలన్నారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం చితాభస్మం సేకరించడం పూర్తిగా సురక్షితమేనని తెలిపారు. ఆ సమయంలో కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదన్నారు. తాము ఈ అధ్యయనం చేయడం వెనుక కారణం చనిపోయిన వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే చేశామన్నారు.