Mpox Scare: మంకీపాక్స్ పై అప్రమత్తం..కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్
Mpox Scare: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపాక్స్ వ్యాధి లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
Mpox Scare: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ భయాందోళనకు గురిచేస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తంగా ఉండాలంటూ సూచింది.దీంతో భారత ప్రభుత్వం కూడా అలర్టయ్యింది. దీనిలో భాగంగా వ్యాధి లక్షణాలను అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎంపాక్స్ అనుమానిత లేదా నిర్ధారణ కేసుల కోసం ఢిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది ఎంపాక్స్ కేసులు బాగా పెరుగుతున్నాయి.
ఇప్పటి వరకు 15,600కేసులు, 537 మరణాలు నమోదు అయ్యాయి. మన దేశంలో మార్చి తర్వాత కొత్తగా ఎంపాక్స్ కేసులు నమోదవ్వలేదు. కాబట్టి మన దగ్గర వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
-ఎమర్జెన్సీ విభాగాల్లో ఎంపాక్స్ కేసులు టెస్టుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
-జ్వరం, దద్దుర్లు వచ్చినవారికి ఎంపాక్స్ నిర్ధారిత బాధితులతో సన్నిహితంగా మెలిగితే వారికి వెంటనే వైద్యపరీక్షలు చేయించాలి.
-జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
-అనుమానిత కేసులను వెంటనే ఐసోలేషన్ లో ఉంచాలి. ఇతరులకు సోకకుండా నివారించే అవకాశం ఉంటుంది.
-అనుమానిత కేసులను ఢిల్లీలోని సప్థార్ జంగ్ ఆసుపత్రికి తరలించాలి.
-రోగులను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ లను ఏర్పాటు చేసుకోవాలి.
ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది.
మంకీపాక్స్ సోకిన వ్యక్తిని మరోక వ్యక్తి తాకడం వల్ల నేరుగా సోకుతుంది. నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల రోగులు వాడిన దుస్తులు, ఇతర వస్తువుల వినియోగం, పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి.
ఈ వైరస్ సోకిన మనిషికి శరీరంలోకి వెళ్లిన తర్వాత 1 నుంచి 21 రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. జ్వరం, గొంతు ఎండిపోవడం, పొక్కులు, తలనొప్పి, కండరా నొప్పులు, వెన్ను నొప్పి వంటివి ఉంటాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు ఉంటాయి. ప్రస్తుం మంకీ పాక్స్ నివారణకు రెండు రకాల టీకాలు ఉన్నాయి. వీటిని గత వారం డబ్ల్యూహెచ్ఓ స్ట్రాటజిక్ అడ్బైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది.