రష్యా కరోనా వ్యాక్సిన్ పట్ల ఆచి తూచి వ్యవహరించాలి!

AIIMS director doctor Rajadeep Guleria on russia vaccine: రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పట్ల ఆచి తూచి వ్యవహరించాలని ఎయిమ్స్ డైరెక్టర్ రాజ్ దీప్ గులేరియా అన్నారు.

Update: 2020-08-11 17:21 GMT
ప్రతీకాత్మక చిత్రం

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 'స్పుట్నిక్‌ వీ' పట్ల ఆచితూచి వ్యవహరించాలని ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియ ప్రకటించారు.

ఈ వ్యాక్సిన్‌ను వాడే ముందుగా ఇది సురిక్షితమైనదా, ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగిఉందా అనేది పరిశీలించాలని ఆ ప్రకటనలో అయన కోరారు. తొలుత ఈ వ్యాక్సిన్‌ సురక్షితమైనదా అనేది వెల్లడికావాల్సి ఉందని, పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేపట్టేముందు ఇది ప్రాథమిక అంశమని డాక్టర్‌ గులేరియ తెలిపారు.

వ్యాక్సిన్‌ పరీక్షల శాంపిల్‌ పరిమాణం, దీని సామర్ధం వంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టవచ్చని ఆయన చెప్పారు. వ్యాక్సిన్‌తో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం కొనసాగుతాయనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలని గులేరియా పేర్కొన్నారు.

ప్రపంచంలో తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసిందని, వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటన చేసిన నేపథ్యంలోడాక్టర్‌ గులేరియ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ వ్యాక్సిన్‌పై ఇంకా తుది పరీక్షలు జరుగుతుండగానే రష్యా వ్యాక్సిన్‌కు ప్రభుత్వం అనుమతించడం పట్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో కోవిడ్‌-19 రోగులకు చికిత్స అందించే రష్యా వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది.

ఇక భారత్‌లో తయారవుతున్న దేశీ వ్యాక్సిన్‌లపై డాక్టర్‌ గులేరియ స్పందిస్తూ భారత వ్యాక్సిన్లు రెండు, మూడవ పరీక్షల దశలో ఉన్నాయని వెల్లడించారు.

కరోనా వైరస్‌ వ్యాక్సిన్ల అభివృద్ధిపై భారత్‌ కసరత్తు సాగిస్తోందని, భారీగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం మనకు ఉందని ఆయన ప్రకటించారు.         

Tags:    

Similar News