నేడే తమిళనాడు సీఎం అభ్యర్థి ప్రకటన.. రేసులో ఉంది వీరే..
అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) పాలక వర్గ సర్వసభ్య ఇవాళ జరుగుతుంది.ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాల్సి ఉంది..
అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) పాలక వర్గ సర్వసభ్య ఇవాళ జరుగుతుంది.ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాల్సి ఉంది. సీఎం అభ్యర్థి బరిలో ప్రస్తుత సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం తోపాటు మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి కూడా రేసులో ఉన్నారు. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శిగా దివంగత సీఎం జయలలితే శాశ్వతం అని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఆ పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. మరోవైపు పార్టీ ప్రిసిడియం చైర్మన్ ఇ. మధుసూధనన్ అధ్యక్షతన పార్టీ వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకునేందుకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 11 మందితో ఈ స్టీరింగ్ కమిటీ ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కమిటీలో ఉన్న వాళ్ళే దాదాపుగా సీఎం అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
కాగా మాజీ ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి జె. జయలలిత మరణించిన వారాల తరువాత, 2016 డిసెంబర్‌లో శశికళ ఆ పదవిని అధిష్టించారు. శశికళ పార్టీని చేపట్టి ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించుకున్న ఒక నెల తరువాత పన్నీర్‌సెల్వం తిరుగుబాటు చేసి పార్టీ నుండి విడిపోయారు. అయితే పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని పన్నీర్ సెల్వంను తిరిగి రప్పించే ఏర్పాట్లు చేశారు. అయితే తన శిబిరం విలీనానికి ముందస్తు షరతుగా శశికళను తొలగించాలని డిమాండ్ పెట్టారు. దాంతో ఆ పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లను పార్టీ పదువుల నుంచే కాకుండా పార్టీ నుంచి బహిష్కరించారు. అదేసమయంలో జయలలిత అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ ఈ సమావేశంలో తీర్మానించారు.