India: ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా అహ్మాదాబాద్ స్టేడియం

India: రేపటి నుంచి మోతేరాలో భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ * 63 ఎకరాల్లో సర్దార్ పటేల్ స్టేడియం సిద్ధం

Update: 2021-02-23 02:06 GMT

సర్దార్ స్టేడియం (ఫైల్ ఇమేజ్ ది హన్స్ ఇండియా)

India: ప్రపంచంలోనే అతిపెద్దదిగా అహ్మదాబాద్ స్టేడియం రెడీ అవుతోంది. రేపటి నుంచి జరగబోయే భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ కోసం సర్దార్ పటేల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. మోతేరాను ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తిరిగి నిర్మించారు. ఈ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పింక్‌బాల్‌ను వినియోగించనున్నారు. ఇదిలా ఉంటే.. తొలిసారి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తున్న సర్దార్ పటేల్ స్టేడియానికి అనేక ప్రత్యేకతలున్నాయి. అహ్మాదాబాద్‌లోని మోతేరా స్టేడియం ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది. దాదాపు 63 ఎకరాల్లో ఈ స్టేడియాన్ని నిర్మించారు.

సర్దార్ పటేల్ స్టేడియంలో ఒకేసారి లక్షకు పైగా మంది ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్‌ను చూసే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ స్టేడియాన్ని ఆధునాతన సౌకర్యాలతో నిర్మించారు. ఒక వేళ మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం కారణంగా స్టేడియంలోకి వచ్చినట్లయితే.. ఆ నీటిని 30 నిమిషాల్లో బయటకు పంపేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ స్టేడియంలో 76 కార్పొరేట్ బాక్స్‌లు, నాలుగు టీమ్ డ్రెస్సింగ్ రూములున్నాయి. 40 మంది అథ్లెట్లకు సరిపడా వసతా గృహాలతో కూడిన ఇండోర్ క్రికెట్ అకాడమీ కూడా ఈ స్టేడియంలో అందుబాటులో ఉంది.

తొలిసారి పింక్ బాల్‌తో టెస్ట్‌ మ్యాచ్ జరుగుతుండడంతో అందుకోసం కోహ్లీ సేన ముమ్మర సాధన చేస్తోంది. 2019లో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో పింక్ బాల్ టెస్ట్ ఆడిన టీమిండియా ఆ తర్వాత జరుగుతున్న రెండో మ్యాచ్ ఇదే కావడంతో.. సాధన మరింత పెంచారు.. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు స్వింగయ్యే పింక్ బంతులతో నెట్స్ లో తీవ్రంగా శ్రమించింది. నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి రెండు టెస్టులు జరిగాయి. ఇరు టీమ్‌లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక ఈ నెల 24 నుంచి మూడో టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనుంది. 

Tags:    

Similar News