దేశ చరిత్రలో తొలిసారి..ఒకే కేసులో 38మందికి ఉరిశిక్ష

Ahmedabad Serial Blast Case: అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసులో గుజరాత్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Update: 2022-02-18 09:45 GMT

దేశ చరిత్రలో తొలిసారి..ఒకే కేసులో 38మందికి ఉరిశిక్ష

Ahmedabad Serial Blast Case: అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసులో గుజరాత్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008 సంవత్సరం జులై 26 వ తేదీన 70 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్‌లో జరిపిన వరుస బాంబు పేలుళ్లలో 56 మంది మరణించారు, 243 మంది గాయపడ్డారు. ఆనాటి ఈ ఘటన అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ఇప్పటికీ కొందరు జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్నారు. ఆ వరుస పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరి శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు జడ్జి ఏ.ఆర్. పటేల్ తీర్పు చెప్పారు. ఇంత భారీ సంఖ్యలో ఒకేసారి ఉరిశిక్షలు విధించడం దేశచరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్నారు.

ఈ కేసులో మరో 11 మందికి జీవిత ఖైదు విధించగా 28 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి 50 వేలు, స్వల్ప గాయాల పాలైనవారికి 25 వేలు కాంపెన్సేషన్ ఇవ్వాలని జడ్జి తన తీర్పులో వినిపించారు. ఈ తీర్పును హైకోర్టు కన్ఫామ్ చేయాల్సి ఉంది. ఐపీసీలోని హత్య, హత్యాయత్నం, దేశ ద్రోహం, జాతి విద్రోహ కార్యకలాపాలు, యూఏపీఏ వంటి చట్టాల ద్వారా ఈ కేసును విచారించారు. ఈ ఘటనతో ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులకు చెందిన భారీ నెట్ వర్క్ ను గుజరాత్ పోలీసులు విజయవంతంగా ఛేదించగలిగారు. 2002 నాటి గోద్రా ఘటనకు ప్రతీకారంగా ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. 

Tags:    

Similar News