ఐటీ నోటీసులను ధృవీకరించిన అహ్మద్‌ పటేల్‌

ఆదాయ పన్ను శాఖ నోటీసులపై కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌ స్పందించారు. రూ. 550 కోట్ల లావాదేవీలపై తనకు నోటీసులు వచ్చినట్లు ఆయన ధ్రువీకరించారు.

Update: 2020-03-06 10:15 GMT
Kamal Nath

ఆదాయ పన్ను శాఖ నోటీసులపై కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌ స్పందించారు. రూ. 550 కోట్ల లావాదేవీలపై తనకు నోటీసులు వచ్చినట్లు ఆయన ధ్రువీకరించారు. పార్టీ తరఫున ఆ డబ్బు స్వీకరించామని స్పష్టం చేశారు. 2019 ఏప్రిల్ 2 న మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలతో పాటు అక్టోబర్ 2019 మరియు ఫిబ్రవరి 2020 న హైదరాబాద్, విజయవాడ , మరియు ఇతర ప్రదేశాలలో 52 ప్రదేశాలలో ఐటి శాఖ చేసిన శోధనల తరువాత ఈ సమన్లు వచ్చాయి. కాగా సమన్లు అందినట్లు ధృవీకరించిన పటేల్..

తాను అనారోగ్యంతో ఉన్నానని అలాగే పార్లమెంటరీ పనుల్లో బిజీగా ఉన్నానని, ఇటువంటి నోటీసులు ప్రతి రాజకీయ పార్టీకి అందుతాయని.. సమావేశాల అనంతరం దీనిపై స్పందిస్తానని పేర్కొన్నారు. రెండు సమన్లలో ఒకటి తన పార్లమెంటు ఇమెయిల్‌లో తనకు పంపారని చెప్పారు. ఏప్రిల్ 2019 మరియు అక్టోబర్ 2019 మధ్య సమయంలో వివిధ నగరాల్లో నివసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఆరుగురు లీడర్ల వద్ద ఐటీ శాఖా సోదాలు నిర్వహించింది.

తెలుగు రాష్ట్రాలు, పుణెతో పాటు, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సాధారణ ఎన్నికల కంటే ముందస్తుగా జరిగిన ఎన్నికలలో, ఆదాయపు పన్ను శాఖ వివిధ నగదు విరాళాల వివరాలను సేకరించింది. అందులో కాంగ్రెస్ పార్టీకి 2019 సార్వత్రిక ఎన్నికలలో ఖర్చుల కోసం కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ నివాసం నుండి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యాలయానికి రూ .20 కోట్ల నగదును బదిలీ జరిగినట్టు గుర్తించింది. ఇక ఐటి దర్యాప్తు నివేదిక కాపీని ఎన్నికల కమిషన్ అందుకుంది.

అలాగే ఇటు హైదరాబాద్‌, విజయవాడ, కడప, విశాఖలో తనిఖీలు జరిపిన ఐటీ శాఖా టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాసరావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం ఉమ్మడి ఏపీ నుంచి రూ.2వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రస్తుతం ఐటీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    

Similar News