విడుదలకు ముందు శశికళకు ఊహించని ఎదురుదెబ్బ..

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత నెచ్చలి వి.కె.శశికలకు జైలు నుంచి విడుదలయ్యే ముందు భారీ షాక్ తగిలింది. విడుదలకు ముందు శశికళకు ఊహించని ఎదురుదెబ్బ..

Update: 2020-10-08 02:16 GMT

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత నెచ్చలి వి.కె.శశికలకు జైలు నుంచి విడుదలయ్యే ముందు భారీ షాక్ తగిలింది. 1500 కోట్ల రూపాయలు విలువైన ఆమె ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది. 2017 సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ప్రక్రియ నిర్వహించామని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఇంత ఆలస్యంగా ఆస్తులను ఎందుకు సీజ్ చేశారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులలో సింహభాగం తమిళనాడులోని కోడనాండ్ సిరుతావూర్ ప్రాంతాలలో ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. బోగస్‌ కంపెనీల పేరుతో శశికళ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆ ఆస్తులను అటాచ్ చేశారు. 1995న శశికళ శ్రీహరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ బినామీ కంపెనీని ఏర్పాటు చేసినట్టు ఐటీ శాఖ గుర్తించింది.

అంతేకాకుండా పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆమె పెద్దఎత్తున నోట్ల మార్పిడి చేసినట్టు గుర్తించింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుండి జనవరి చివరి నాటికి విడుదల కానున్నారు.. కాగా గత నెలలో, సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా, జైలు అధికారులు జరిమానా చెల్లిస్తే జనవరి 27 న శశికళను విడుదల చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమె విడుదల లోపే జరిగిన పరిణామం శశికళకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇదిలావుంటే జైలు శిక్ష నేపథ్యంలో వికె శశికళ మరో రెండేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.

Tags:    

Similar News