Agnipath: అగ్నిపథ్ కు కాంగ్రెస్ హయాంలోనే బీజం పడింది..
Agnipath: అగ్నిపథ్ పథకంపై రాజకీయం చేయవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Agnipath: అగ్నిపథ్ పథకంపై రాజకీయం చేయవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్‌తో దేశయువతకు మంచి జరుగుతుందేతప్ప... ఎవ్వరికీ నష్టం జరుగదని స్పష్టంచేశారు. 1999లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అగ్నిపథ్ పథకానికి బీజంపడిందని పేర్కొన్నారు. అగ్ని వీరులుగా ఒకసారి పనిచేస్తే... ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. సైన్యంనుంచి బయటకొచ్చాక ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించవచ్చనే అభిప్రాయం వ్యక్తంచేశారు. అగ్నిపథ్ పథకంపై అపోహలతో ఆందోళనలకు దిగి జీవితాలను పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు.