Lock Down: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు

Lock Down: కోవిడ్ కట్టడికి కఠిన ఆంక్షలు విధిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాలు

Update: 2021-04-10 02:45 GMT

లాక్ డౌన్ (ఫైల్ ఫోటో)

Lock Down: దేశంలో పరిస్థితులు రోజురోజుకూ భయానకంగా మారుతున్నాయి. పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు వీకెండ్ లాక్‌డౌన్‌లు విధిస్తుండటంతో మళ్లీ దేశంలో ఏడాది క్రితం కనిపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మళ్లీ వలస వచ్చిన జనమంతా సొంతూళ్లకు తిరుగుప్రయాణమవుతున్నారు. ఒకవైపు కేసులు పెరుగుతుండడం, మరోవైపు వ్యాక్సినేషన్‌ స్టాక్‌ సరిపడా లేదని కొన్ని రాష్ట్రాలు ప్రకటించడంతో నగరాల కంటే తమ సొంతూళ్లే మేలని తిరుగుప్రయాణమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్‌ స్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి.

మరోవైపు పలు రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడి కోసం కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. దేశరాజధానిలో నిన్న 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే మరో వెయ్యి కేసులు అదనంగా వచ్చాయి. దీంతో ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు అనుసరించని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు అధికారులు. మరోవైపు నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక మహారాష్ట్రలో గురువారంతో పోలిస్తే శుక్రవారం రెండు వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. 24 గంటల్లో 58వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. అయితే రాష్ట్రంలోని ముంబై, పూణే, నాగ్‌పూర్‌ సహా పలు నగరాలు, జిల్లాల్లో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల కఠిన లాక్డౌన్‌ విధించనున్నారు. ముంబై నగరంలో వీకెండ్‌ లాక్డౌన్‌ విధించారు. పూణే మునిసిపల్‌ కార్పొరేషన్‌ నగరంలో ఈనెల 30వ తేదీ వరకు అన్ని మార్కెట్లు, దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News