Lock Down: మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్!
Lock Down: నేడో రేపో వెలువడనున్న ప్రకటన * ఇవాళ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో సీఎం కీలక సమావేశం
Lock Down: మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైరస్ ఉధృతి అనూహ్యంగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్ విధించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రెండు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్ కంటే ప్రత్యామ్నాయం కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనిపై నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ సభ్యులతో సమావేశమయ్యారు. కరోనా చైన్‌ను వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని నిర్ణయించారు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కూడా లాక్‌డౌన్‌కు ఓకే అంటున్నారు. అయితే సమావేశంలో పాల్గొన్న వారిలో కొందరు రెండు వారాల లాక్‌డౌన్‌కు ప్రతిపాదించగా, మరికొందరు మూడు వారాలు విధించాలని సూచించారు. ఇవాళ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో మరోసారి భేటీ కానున్న సీఎం.. లాక్‌డౌన్‌పై నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
మహారాష్ట్రలో కొద్దిరోజులుగా 60 వేలకు చేరువలో నమోదైన రోజువారీ కోవిడ్ కేసులు.. ఆదివారం 60 వేలు దాటాయి. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 10 మధ్య నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి. 19 వందల 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల కోసం ఏర్పాటు చేసిన ఐసీయూలు 75 శాతం ఆక్సిజన్ బెడ్లు 40 శాతం నిండిపోయాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారితే బెడ్ల కొరత ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్ సరైన నిర్ణయమని భావిస్తోంది మహా సర్కార్.