Coronavirus: దేశంలో మళ్లీ కరోనా పంజా

Coronavirus: ఆదివారం ఒక్కరోజే 43,846 పాజిటివ్ కేసులు * మార్చి 15-21 మధ్య 2.60 లక్షల కేసులు

Update: 2021-03-22 02:44 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: ఇక దేశంలో వారం వ్యవధిలో కొవిడ్ కేసుల సంఖ్య 67 శాతం పెరిగింది. మార్చి 15 నుంచి 21 వరకు 2 లక్షల 60 వేల కేసులు నమోదయ్యాయి. ఇక రోజుకు వంద మందికి పైగా మరణిస్తుండటంతో.. మరణాల్లోనూ 41 శాతం పెరుగుదల కనిపించింది.

వైరస్‌ ఉధృతమవుతుండటంతో దేశంలో మళ్లీ భయానక పరిస్థితులు మొదలయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతోన్న రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే 83 శాతానికి పైగా కేసులు వస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 27వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 99 మంది వైరస్‌ బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ముంబై, పుణె సహా పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది అక్కడి ప్రభుత్వం. గుజరాత్‌ ప్రభుత్వం పాఠశాలల్ని మూసివేసింది. రాజస్థాన్‌లో 8 నగరాల్లో కొవిడ్‌ కేసులు పెరగడంతో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు.

ఇక మధ్యప్రదేశ్‌లో వైరస్ బాధితులు పెరుగుతున్నారు. దీంతో వారాంతపు లాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకుంది అక్కడ ప్రభుత్వం. భోపాల్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌ నగరాల్లో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక పాఠశాలలను కూడా ఈనెల 31 వరకు మూసివేసి ఉంచాలని నిర్ణయించారు. 

Tags:    

Similar News