Dead Bodies: గంగానది ఒడ్డున మళ్లీ మృతదేహాలు
Dead Bodies: ఉత్తర ప్రదేశ్ లో గంగానది ఒడ్డున రోజుకోచోట ఇసుకలో మృతదేహాలు బయటపడుతున్నాయి
Dead Bodies: ఉత్తర ప్రదేశ్ లో గంగానది ఒడ్డున రోజుకోచోట ఇసుకలో మృతదేహాలు బయటపడుతుండడం కలకలం రేగుతోంది. పవిత్ర గంగానది ఒడ్డున మృతదేహాల దర్శనం ఇప్పటికే కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఒకరినొకరిని విమర్శించుకున్నాయి కూడా. ఆ తర్వాత రెండు రాష్ట్రాలు విచారణకు ఆదేశించాయి. కాని ఇప్పటికీ ఎవరూ ఆ మృతదేహాలు ఎలా వచ్చాయో చెప్పలేకపోతున్నారు.
ఇప్పుడు తాజాగా ప్రయాగరాజ్ జిల్ దేవరఖ్ ఘాట్ వద్ద ఇసుకలో వందల మృతదేహాలు బయటపడుతున్నాయి. కోవిడ్ వల్ల చనిపోతున్నవారు ఎక్కువ సంఖ్యలో ఉండటం.. శ్మశానాలు ఖాళీ లేకపోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతదేహాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతదేహాలను ఇసుకలో పూడ్చిపెట్టడాన్ని, నదిలో వేయటాన్నిప్రభుత్వం నిషేధించింది. ఉల్లంఘించిన వారిని తీవ్రంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించారు.
ఇప్పటికే గుజరాత్ లోనూ మృతదేహాల లెక్కల విషయంలో వివాదం చెలరేగింది. డెత్ సర్టిఫికెట్ల లెక్కలకు, కోవిడ్ మృతుల లెక్కలకు పొంతనే లేదనే విషయం బయటపడింది. కాని గుజరాత్ ప్రభుత్వం ఖండించింది. కోవిడ్ లెక్కల్లో లేని మృతదేహాలే గంగా ఒడ్డున దొరుకుతున్నాయనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి.