అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య కొనసాగుతున్న వార్

* పార్టీ ఎమ్మెల్యేలతో కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్ భేటీ * రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణ ద్వారా వివాదానికి ఫుల్‌స్టాప్

Update: 2021-07-25 13:15 GMT

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ 

Rajasthan Politics : పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభానికి తెరదింపిన కాంగ్రెస్ అధిష్ఠానం రాజస్థాన్‌పై ఫోకస్ చేసింది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య పొరపొచ్చాలు వచ్చిన నేపధ్యంలో వివాదానికి స్వస్తి పలకాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టి, వివాదానికి పూర్తిస్థాయిలో ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు. దీంట్లో భాగంగా పార్టీ సంస్ధాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించారు.

మరోవైపు ఈ భేటీ అనంతరం మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణపై స్పందించిన అజయ్ మాకెన్ జిల్లా, బ్లాక్ లెవెల్ కాంగ్రెస్ చీఫ్‌ల నియామకం, బోర్డులు, కార్పొరేషన్‌లలో నియామకాలపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యమని నేతలంతా చెప్పినట్లు అజయ్ మాకెన్ పేర్కొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ క్యాంప్‌లో కొద్దికాలంగా అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ, రాజకీయ నియామకాల వ్యవహారం ఊపందుకుంది.

Tags:    

Similar News