భారత్‌తో చేతులు కలిపిన పాకిస్తాన్
Covid Deaths: గ్రౌండ్ రియాల్టీ పక్కనబెడితే ఇండియా, పాకిస్తాన్ చాలా విషయాల్లో భిన్నధ్రువాలుగా ఉంటాయన్న ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది.
Covid Deaths: గ్రౌండ్ రియాల్టీ పక్కనబెడితే ఇండియా, పాకిస్తాన్ చాలా విషయాల్లో భిన్నధ్రువాలుగా ఉంటాయన్న ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అయితే ఇటీవల ఇండియా ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది పాకిస్తాన్ కూడా ఇప్పుడు అదే తరహాలో మాట్లాడి ఆశ్చర్యానికి గురిచేసింది. కరోనా మరణాల విషయంలో ఇటు ఇండియా, అటు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయ్. who కరోనా లెక్కలు కాకిలెక్కలంటూ రెండు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయ్. ప్రపంచం ముందు ఇలాంటి లెక్కలు చూపించి who నవ్వులపాలవ్వొద్దని హెచ్చరించాయ్.
ప్రపంచ ఆరోగ్య సంస్థ whoపై పాకిస్తాన్ నిప్పులు చెరిగింది. వాస్తవంతో పోల్చుకుంటే పాకిస్తాన్‌లో కరోనా మృతులు ఎనిమిది రెట్లు ఎక్కువంటూ మండిపడింది. కరోనాతో పాక్‌లో 2 లక్షల 60 వేల మృతి చెందారంటే అయితే పాకిస్తాన్ లో గత రెండేళ్లలో కరోనా కేసులు 15 లక్షలు కాగా, 30, 369 మంది మృత్యువాతపడ్డారు. పాకిస్తాన్ కరోనా లెక్కల గురించి who రిపోర్ట్ సత్యదూరమని పాకిస్తాన్ మండిపడింది. అఫిషియల్ అనఫిషియల్ అన్న లెక్కలు ఏవీ ఉండవని చెప్పింది. దేశంలో కరోనా లెక్కలను మాన్యుయల్ గా రికార్డ్ చేశామంది పాక్. ఒకవేళ తేడా వచ్చినా అది వందల్లో కానీ, వేలల్లో ఉంటుందని వేలు, లక్షల్లో ఉండదంది.
ప్రపంచాన్ని రెండేళ్లుగా గడగడలాడించిన కరోనాతో ఇప్పటి వరకు కోటిన్నర మంది మృతి చెంది ఉంటారని who నిర్ధారించింది. ఐతే వివిధ దేశాలు మాత్రం చెబుతున్న లెక్కల ప్రకారం ఆ సంఖ్య 60 లక్షలుగా ఉన్నాయ్. కరోనా మూలంగా దక్షిణాసియా, యూరప్, అమెరికాలో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయ్. ఐతే who చెబుతున్న నెంబర్లను తాము ఎన్నిటికీ ఆమోదించమన్నారు పాక్ మంత్రి పటేల్. who వాడుతున్న సాఫ్ట్‌వేర్‌లో ప్రాబ్లమ్ ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. స్మశనాలకు తెచ్చిన శవపేటికల ఆధారమన్న మృతులను అంచనా వేసినట్టు పాక్ చెబుతోంది. ఏదైన తేడా వచ్చినా వందల్లో వస్తుందని ఇంత పెద్ద సంఖ్యలో రాదంటూ who మెథడాలజీని విమర్శించింది.
మరోవైపు కరోనా లెక్కలపై ఇండియా సైతం whoపై విరుచుకుపడింది. ఇండియాలో నమోదైన కరోనా కేసులకంటే వాస్తవంలో మరణాలు 8 రెట్టు ఎక్కువంది. అయితే who కాకి లెక్కలు చెప్తోందని కేంద్రం మండిపడింది. who చెబుతున్నట్టుగా రెండేళ్లలో కరోనా మృతులు 47 లక్షల కాదని కేవలం 5లక్షల 20 వేల మృతులు మాత్రమేనంది. కరోనా మరణాలపైనా who నివేదికపై కేంద్రం భగ్గుమంది. who డేటా సేకరణ తప్పులతడకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పటిష్ట నిఘా ఆధారంగానే ఇండియాలో మరణాలు లెక్కించామ పేర్కొంది.