Karnataka: మొన్న హిజాబ్, ఇప్పుడు బైబిల్
Karnataka: స్కూల్‌కి బైబిల్ తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదని.. పేరెంట్స్ నుంచి హామీ తీసుకున్న క్లారెన్స్ హైస్కూల్
Karnataka: కర్ణాటకలోని పాఠశాలలలో మరో వివాదం తెరపైకి వచ్చింది. మొన్న హిజాబ్, ఇప్పుడు బైబిల్ అంశం కొత్త వివాదాన్ని సృష్టిస్తుంది. స్కూల్‌కి బైబిల్ తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదని పేరెంట్స్ నుంచి క్లారెన్స్ హైస్కూల్ యాజమాన్యం హామీ తీసుకుంది. ఈ కొత్త ఆదేశం కర్ణాటక విద్యాచట్టాన్ని ఉల్లంఘించడమే అని మితవాద సమూహాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బైబిల్ చదవాలని క్రైస్తవేతర విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారని హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ విమర్శించారు. తమ వైఖరిని పాఠశాల యాజమాన్యం సమర్ధించుకుంటుంది.