Actress Kushboo Supports NEP 2020: కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఖుష్బూ
Actress Kushboo Supports NEP 2020: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని తను స్వాగతిస్తున్ననంటూ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది.
Actress Kushboo Supports NEP 2020: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని తను స్వాగతిస్తున్ననంటూ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. తన రోబోను కాను. కీలు బొమ్మను అసలే కానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మోడీ సర్కార్ ప్రవేశపడుతున్న నూతన విద్యా విధానాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి విభేదించింది. కాంగ్రెస్ నేత ఖుష్బూ మాత్రం నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నాని అన్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీకి తన అభిప్రాయంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మోడీ సర్కారు ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నటికీ, తాను మాత్రం పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నాని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని క్షమించాలని కోరారు.
'' రాహుల్ గాంధీ గారూ… నన్ను క్షమించాలి. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. నేను రోబోను కాను. కీలు బొమ్మను అసలే కాను. ప్రతి విషయంలోనూ అధిష్ఠానానికి తలూపాల్సిన పని లేదు. ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలి'' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.ఇదిలావుంటే దక్షిణ భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కుష్బూ ఒక్కసారిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కొందరు బీజేపీలోకి రావాలంటూ ఖుష్బూ ను ఆహ్వానించగా.. వారికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. అంత మాత్రం చేత తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరనని, సంఘ్ పరివార్ భక్తులు ఈ ప్రపంచంలో అత్యంత గందరగోళ జీవులుగా ఎద్దేవా చేశారు.
My stand on #NEP2020 differs from my party n I apologize to @RahulGandhi ji for that, but I rather speak the fact than be a head nodding robot or a puppet. Everything is n cannot be about agreeing to ur leader, but about being courages to voice ur opinion bravely as a citizen ..
— KhushbuSundar ❤️ (@khushsundar) July 30, 2020