ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి రేపు బెంగాల్‌లో జరిగే ప్రధాని మోడీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆయన బీజేపీలో చేరుతున్నారా? లేక పార్టీ తరపున ప్రచారం చేస్తారా? అన్న విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. గత నెల 16న ఆరెస్సెస్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో కూడా మిథున్ చక్రవర్తి భేటీ అయ్యారు. మిథున్ గతంలో తృణమూల్ నుంచి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం తర్వాత రాజ్యసభకు రాజీనామా చేశారాయన. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కారణంగా ఆయన్ను ఈడీ ప్రశ్నించింది. ఈ ఘటన తర్వాతే అనారోగ్య కారణాలను చూపుతూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తృణమూల్‌కు దూరంగా ఉంటున్నారు.