బీజేపీలో చేరిన సినీనటి కుష్బూ

ప్రముఖ నటి, కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి కుష్భు సుందర్ సోమవారం ఢిల్లీలో బిజెపిలో చేరారు. తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎల్. మురుగన్, బిజెపి

Update: 2020-10-12 09:45 GMT

ప్రముఖ నటి, కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి కుష్భు సుందర్ సోమవారం బిజెపిలో చేరారు. ఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎల్. మురుగన్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి సమక్షంలో బిజెపిలో చేరారు. కాగా ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన కుష్బూ పార్టీ నాయకత్వంపైనే కాకుండా కొన్ని విధానాల పరంగాను కూడా విమర్శలు చేశారు.

ఈ క్రమంలో ఆమె ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక బీజేపీలో చేరిన కుష్భు మాట్లాడుతూ.. ఏమాత్రం ప్రజాబలం లేని నాయకుల చేతిలో కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్‌ఛార్జి కార్యదర్శి ప్రణవ్ కుష్భును పార్టీ ప్రతినిధిగా తొలగించినట్లు ప్రకటించారు. ఇదిలావుంటే 2010లో డీఎంకేలో చేరిన కుష్బూ ఆ పార్టీ నేతలతో విభేదించి 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ లో చేరారు. తాజాగా బీజేపీలో చేరడంతో పదేళ్ల కాలంలోనే ఆమె మూడు పార్టీలను మారిన విషయం ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News