India Corona Cases: 24 గంటల్లో 42 వేలకు పైగా కేసులు
Corona Cases in India: కొవిడ్ తో 562 మంది మృతి * 48 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సినేషన్
Corona Cases in India: తగ్గినట్లే తగ్గిన కరోనా మళ్లీ కోరలు చాస్తుంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కసారిగా 40శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 42 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా పెరిగింది.నిన్న 5వందల మందిపైగా చనిపోయారు. కొవిడ్ నుంచి 36 వేల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది.
దేశంలో కరోనా మళ్లీ విస్తరిస్తుంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. పాజిటీవిటీ రేటు నాలుగులక్షల మార్క్ దాటింది. ప్రస్తుతం 4లక్షల 10వేల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. పాజిటీవ్ రేటు 1.29 శాతానికి పెరిగింది.ఇప్పటివరకు మొత్తం కేసులు 3 కోట్ల 17లక్షలకు చేరాయి.4లక్షల 25వేల మంది మహమ్మారికి బలయ్యారు. ఇక కరోనా కంట్రోల్ కోసం కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. నిన్న 62.53లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 48 కోట్ల మార్కును దాటింది.