కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఆప్ శ్రేణులు సంబరాలు
మిఠాయిలు పంచుకున్న కార్యకర్తలు ముఖ్య నేతలు
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆప్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులు బీజేపీకి చెంపపెట్టని ఆప్ హరియాణ చీఫ్ సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. ఇక ఇదే కేసులో ఇప్పటికే విడుదలైన మనీష్ సిసోడియా బీజేపీపై విరుచుకపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తొత్తులుగా భావిస్తోందన్నారు. వాటిని వాడుకుని కేజ్రీవాల్‌ను జైళ్లో ఉంచాలనే ప్రయత్నించారన్నారు. కేజ్రీవాల్ ఏ తప్పు చేయలేదన్నారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించి.. జైళ్లో పెట్టాలని చూశారని... సుప్రీంకోర్ట్ కూడా ఇదే స్పష‌్టం చేసినట్టు మనీష్ సిసోడియా తెలిపారు.