Aadhaar: ఆధార్‌ కార్డ్ అలర్ట్.. ఇంటి నుంచే ఈ పనులు కంప్లీట్.. అవేంటంటే..?

Aadhaar: భారతదేశంలో ఆధార్ కార్డుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది లేకుండా ఏ పని జరుగదు.

Update: 2022-02-25 09:07 GMT

Aadhaar: ఆధార్‌ కార్డ్ అలర్ట్.. ఇంటి నుంచే ఈ పనులు కంప్లీట్.. అవేంటంటే..?

Aadhaar: భారతదేశంలో ఆధార్ కార్డుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది లేకుండా ఏ పని జరుగదు. ఆధార్ కార్డు గుర్తింపు రుజువు మాత్రమే కాదు అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర ప్రయోజనాలకు తప్పనిసరిగా అవసరం. ఆధార్ కార్డులో అవసరమైన సమాచారం ఉంటుంది. పిల్లల అడ్మిషన్ నుంచి ప్రభుత్వ ఫారమ్‌లను నింపే వరకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. అయితే చాలా సార్లు ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీని మార్చవలసి ఉంటుంది. లేదా కొత్త ఆధార్ కార్డుకి అప్లై చేయవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రంలో పొడవైన లైన్లని నివారించవచ్చు. ఆధార్ అప్‌డేట్ కోసం అపాయింట్‌మెంట్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

ఈ పనులు చేసుకోవచ్చు..

కొత్త ఆధార్ నమోదు, పేరు నవీకరణ, చిరునామా నవీకరణ, మొబైల్ నంబర్ నవీకరణ, ఈ మెయిల్ ID నవీకరణ, పుట్టిన తేదీ నవీకరణ, లింగ నవీకరణ, బయోమెట్రిక్ నవీకరణ

ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌ ఇలా బుక్ చేయండి

1. https://uidai.gov.in/ కు వెళ్లండి.

2. నా ఆధార్‌పై క్లిక్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.

3. ఆధార్ సేవా కేంద్రాలలో బుక్ అపాయింట్‌మెంట్‌ని ఎంచుకోండి.

4. డ్రాప్‌డౌన్‌లో మీ నగరం, స్థానాన్ని ఎంచుకోండి.

5. అపాయింట్‌మెంట్ బుక్ చేయడానికి ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి.

6. మొబైల్ నంబర్‌ను నమోదు చేసి 'కొత్త ఆధార్' లేదా 'ఆధార్ అప్‌డేట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

7. క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ OTPపై క్లిక్ చేయండి.

8. OTPని నమోదు చేసి వెరిఫైపై క్లిక్ చేయండి.

9. రుజువుతో పాటు వ్యక్తిగత వివరాలు, చిరునామా వివరాలను నమోదు చేయండి.

10. టైమ్ స్లాట్‌ని ఎంచుకుని నెక్స్ట్‌పై క్లిక్ చేయండి.

11. ఇలా చేయడం ద్వారా మీ అపాయింట్‌మెంట్ పూర్తవుతుంది.

Tags:    

Similar News