Aadhaar: ఆధార్‌లో మరో కొత్త మార్పు.. ఇప్పుడు మరింత జాగ్రత్త..!
Aadhaar: ఆధార్‌లో మరో కొత్త మార్పు.. ఇప్పుడు మరింత జాగ్రత్త..!
Aadhaar: ఆధార్ పరిధిని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాలలో ఆధార్ పరిధిని పెంచి ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలని రాష్ట్రాలను కోరింది. అందుకే వివిధ రాష్ట్రాల ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం మరింత పెరిగింది. దీనివల్ల నకిలీ లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది.
ఇప్పటికే UIDAI వివిధ రాష్ట్రాలలో ఉండే తమ ఉద్యోగులకి ఆధార్‌కు సంబంధించి పలు శిక్షణ ఇస్తోంది. వీరందరు 10 సంవత్సరాలకి ఒకసారి ప్రజలకి సంబంధించిన బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్ వివరాలు అప్‌డేట్ చేయడం ప్రారంభిస్తారు. UIDAI ప్రకారం.. ఒక వ్యక్తి ప్రతి 10 సంవత్సరాలకు తనకు నచ్చిన బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. అయితే ఇది ఇంకా అమలుకాలేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలు వారి బయోమెట్రిక్స్ డేటాను నవీకరించడానికి అనుమతి ఉంది.
బయోమెట్రిక్స్ నవీకరణ
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బ్లూ ఆధార్ ఇస్తారు. ఇందులో వారి ఫోటో, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. పిల్లలకి 15 ఏళ్లు వచ్చిన తర్వాత తని బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేస్తారు. ఇందులో ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ తీసుకుంటారు. ఇందుకోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పేరు, చిరునామా మొదలైనవి కూడా అప్‌డేట్ అవుతాయి. కావాలంటే మీరు రాష్ట్రం, పోస్టల్ కోడ్ ఆధారంగా UIDAI వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సమాచారాన్ని పొందవచ్చు.
బయోమెట్రిక్ ఎలా భద్రపరచాలి..?
ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఆధార్‌ను లాక్ చేయాలని UIDAI సూచిస్తోంది. ఆధార్ నంబర్‌ను తాత్కాలికంగా లాక్, అన్‌లాక్ చేయవచ్చు. దీనివల్ల కార్డ్ హోల్డర్ బయోమెట్రిక్స్ డేటా సురక్షితంగా ఉంటుంది. ఒక వ్యక్తి తనకి అవసరం వచ్చినప్పుడు ఆధార్‌ను సులభంగా అన్‌లాక్ చేయవచ్చు.