హెచ్చరిక.. వీటికి దారి ఇవ్వకపోతే 10,000 రూపాయలు ఫైన్..!

హెచ్చరిక.. వీటికి దారి ఇవ్వకపోతే 10,000 రూపాయలు ఫైన్..!

Update: 2022-06-12 15:30 GMT

హెచ్చరిక.. వీటికి దారి ఇవ్వకపోతే 10,000 రూపాయలు ఫైన్..!

Emergency Vehicles: రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలను పాటించకుంటే మీకు ఫైన్‌ పడే అవకాశాలు ఉంటాయి.అంతే కాదు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అయితే కొంతమందికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండదు. తెలియకుండానే రూల్స్ ఉల్లంఘించడం జరుగుతుంది. దీనివల్ల వారు చాలన్ కట్టాల్సి ఉంటుంది.

రోడ్డుపై ప్రయాణించే వారు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. ఒక ట్రాఫిక్ నిబంధనని ఉల్లంగిస్తే పదివేల ఫైన్‌తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. దాని గురించి తెలుసుకుందాం. ఈ నియమం అత్యవసర వాహనాలకు వర్తిస్తుంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఏదైనా వాహన డ్రైవర్ అత్యవసర వాహనాలకి దారి ఇవ్వకుంటే చలాన్ పడుతుంది. ఈ ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించవద్దు.

ఫైర్‌ ఇంజన్స్‌, అంబులెన్స్‌లు వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వడం తప్పనిసరి. మోటార్ వెహికల్స్ (సవరణ) చట్టం 2019 ప్రకారం అత్యవసర వాహనాలకు మార్గం కల్పించని వాహనదారులకు రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు. సవరించిన మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 194 (e) ప్రకారం ఫైన్‌ కట్టాల్సిందే. అందుకే రోడ్డు పై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Tags:    

Similar News