Rice Price Hike: ఈ సారి బియ్యం వంతు.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు

Rice Price Hike: కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకునే కొన్ని నిర్ణయాలు రైతులకు మేలు చేస్తున్నప్పటికీ..పేద ప్రజలకు మాత్రం ఇబ్బందులకు గురిచేస్తుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడం వల్ల దేశీయంగా ధరలు భారీగా పెరగనున్నాయి.

Update: 2024-09-29 04:31 GMT

Rice Price Hike: ఈ సారి బియ్యం వంతు.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు

Rice Price Hike: ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా..అది తీవ్ర ప్రభావం చూపుతుంది. నాన్ భాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఎగుమతి చెయ్యడానికి కనీస మద్దతు ధరను 490డాలర్లుగా నిర్ణయించింది. ఇది రైతులకు మంచి నిర్ణయం. రైతులు తమ బియ్యాన్ని ముఖ్యంగా డిమాండ్ ఉండే అమెరికా వంటి దేశాల్లో ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ చర్య దేశీయంగా బియ్యం ధరలను పెంచేలా చేసింది.

ఇదివరకు దేశీయంగా ధరలు పెరిగిపోతున్నాయనే కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. 2023 జులై 20న నాన్ భాస్మతి తెల్లబియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకుంది. దాంతో పెరిగే ధరలు కొంత తగ్గాయి. ఇప్పుడు దేశంలో బియ్యం సప్లై బాగా ఉందనీ అందువల్ల కొరత ఉండదనీ ధర పెరగదని కేంద్రం చెబుతోంది. కానీ వ్యాపారులు మాత్రం ఈ వంకతో క్రుత్రిమ కొరత స్రుష్టించి ధరలు పెంచే ప్రమాదం కూడా ఉంది.

ప్రపంచంలో బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఇండియా నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోవడంతో చాలా దేశాల్లో బియ్యాన్ని కొరత వచ్చి ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆ దేశాల్లో ధరల తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల రివర్సులో మన దేశంలో ధరలు పెరిగే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది.

ఈ మధ్యనే కేంద్రం బాస్మతి బియ్యం ఎగుమతిపై కనీస మద్దతు ధరను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎగుమతి సుంకాలను కూడా రద్దు చేసింది. ఇది పారాబాయిల్డ్ రైస్ పై లెవీని 10శాతం మేర తగ్గించింది. అందువల్ల బ్రౌన్ రైస్ పై, వరి ధాన్యంపై కూడా ఎగుమతి సుంకం 10శాతం తగ్గింది. ఇవన్నీరైతులకు కలిసి వచ్చే నిర్ణయాలే. అయినప్పటికీ హర్యానాలో అసెంబ్లీఎన్నికలు ఉండటం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఇప్పటికే బియ్యం ధరలు భారీగా పెరిగాయి. కేజీ ధర రూ. 50 వరకు ఉంది. అక్కడి నుంచి రూ. 70 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక బిర్యానీ కోసం వాడే రకాలు కేజీ నుంచి 100 నుంచి 150 వరకు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ధరలు మరింత పెరిగి ఆ భారం సామాన్య మధ్య తరగతి ప్రజలపై పడుతుంది. ఈమధ్యే వంట నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఉల్లిగడ్డతో సహా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.


Tags:    

Similar News