భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,985 కేసులు నమోదు కాగా,279 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,76,583 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,33,632 ఉండగా, 1,35,205 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 7,745 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 50,61,332 కరోనా టెస్టులు. గడిచిన 24 గంటల్లో1,45,216టెస్టులు నిర్వహణ.