Corona Cases in India: దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు

Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది.

Update: 2021-06-09 04:21 GMT

కరోనా (రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Corona Cases in India: భారత్‌లో‌ కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 92,596 కేసులు నమోదు కాగా, 2,219 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,62,664 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 3,53,528 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 12,31,415 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు వేసినట్లు చెప్పింది. మంగళవారం ఒకే రోజు 19,85,967 దేశవ్యాప్తంగా కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఈ నెల 8వ తేదీ వరకు 37,01,93,563 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

Tags:    

Similar News