7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. వచ్చే నెలలో పెరిగిన జీతాలు ..?

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. వచ్చే నెలలో పెరిగిన జీతాలు ..?

Update: 2022-02-15 02:30 GMT

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. వచ్చే నెలలో పెరిగిన జీతాలు ..?

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకి హోలీ ఇది శుభవార్తనే చెప్పాలి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డియర్‌నెస్ అలవెన్స్‌లో (DA) 3% పెరుగుదల నిర్ణయించారు. అంటే ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు 34% చొప్పున డియర్‌నెస్ అలవెన్స్ పొందుతారు. జనవరి 2022 నుంచి మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 34%గా సెట్ చేశారు. ప్రస్తుతం ఉద్యోగులు ఇప్పటికే  31% డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్నారు. కానీ జనవరి 2022 నుంచి 3% ఎక్కువ డియర్‌నెస్  అలవెన్స్‌ని పొందుతారు. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం బేసిక్ జీతంపై మాత్రమే డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. మార్చిలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నిజానికి ఎన్నికల కారణంగా బట్టి ప్రభుత్వం ప్రకటించలేదు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. తర్వాత ఇప్పుడు తదుపరి డియర్‌నెస్ అలవెన్స్ జూలై  2022లో లెక్కిస్తారు. డిసెంబర్ 2021కి సంబంధించిన AICPI-IW డేటా విడుదల చేశారు. ఈ గణాంకాల ప్రకారం.. డిసెంబర్‌లో ఈ సంఖ్య 0.3 పాయింట్లు తగ్గి 125.4 పాయింట్లకు చేరుకుంది. నవంబర్‌లో ఈ సంఖ్య 125.7 పాయింట్లుగా ఉంది. డిసెంబర్‌లో 0.24% తగ్గింది. కానీ ఇది డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై ప్రభావం చూపలేదు. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఏఐసీపీఐ ఐడబ్ల్యూ గణాంకాల తర్వాత ఈసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను 3 శాతం పెంచాలని నిర్ణయించారు.

34% DAపై లెక్కింపు

డియర్‌నెస్ అలవెన్స్‌ను 3% పెంచిన తర్వాత మొత్తం DA 34% అవుతుంది. ఇప్పుడు రూ.18,000 బేసిక్ జీతంపై వార్షిక పెరుగుదల రూ.6,480 అవుతుంది.

1. ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 18,000

2. కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (34%) రూ. 6120/నెలకు

3. డియర్‌నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (31%) రూ. 5580/నెల

4. ఎంత డియర్‌నెస్ అలవెన్స్ పెరిగింది 6120- 5580 = రూ. 540/నెలకు

5. వార్షిక జీతంలో పెరుగుదల 540X12 = రూ. 6,480

Tags:    

Similar News