7th Pay Commission: రైల్వే ఉద్యోగులకి శుభవార్త.. జీతాలలో పెరుగుదల..!
7th Pay Commission: రైల్వే ఉద్యోగులకి శుభవార్త.. జీతాలలో పెరుగుదల..!
7th Pay Commission: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. ఈ నెలలో రైల్వే కార్మికుల జీతం పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచిన తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ భత్యాన్ని చెల్లించాలని అన్ని జోన్లకి ఆదేశాలు జారీచేసింది. దీనిప్రకారం.. సవరించిన రేట్లతో డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ఈ చెల్లింపులు జరుగుతాయి.
రైల్వే బోర్డు డిప్యూటీ డైరెక్టర్ జై కుమార్ ఈ మేరకు అన్ని జోన్లు, ఉత్పత్తి యూనిట్లకు లేఖ జారీ చేశారు. ఇందులో 'రైల్వే ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్‌నెస్ అలవెన్స్‌ను జనవరి 1, 2022 నుంచి అమలులోకి వచ్చేలా బేసిక్ పేలో ప్రస్తుతం ఉన్న 31% నుంచి 34%కి పెంచుతామనిపేర్కొన్నారు. ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆర్డర్ కాపీ అన్ని సంబంధిత యూనిట్లకు అందిన తర్వాత జనవరి 1, 2022 నుంచి 34% పెరిగిన రేటుతో డియర్‌నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. దీంతో పాటు ఏప్రిల్ 30న బకాయిలతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ కూడా చెల్లిస్తామని గోపాల్ మిశ్రా తెలిపారు.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతంకు చేరనుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 31 శాతం మేర డీఏను పెంచాలని కేంద్రం నిర్ణయించగా.. ఇప్పుడు అనూహ్యంగా డీఏను 34 శాతంగా పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్ పే/పెన్షన్‌కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది.