Corona: గంటకు 70 మరణాలు.. నిమిషానికి ఒకరు

Corona: దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోన్న కరోనా మహ్మమారి * గంటలకు 70 మరణాలు నిమిషానికి ఒకరు

Update: 2021-04-21 03:15 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona: కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తోంది. ప్రజలను ముంచెత్తుతోంది,. లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కోవిడ్ బారిన పడి రోజూ వందల మంది చనిపోతున్నారు. గత ఆదివారం నుంచి నిమిషానికి ఒకరు చొప్పున చనిపోతున్నారు. గంటకు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నయాని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజు రోజుకూ ఈ సంఖ్య పెరుగుతోంది. ఏప్రిల్ 1న గంటకు 3వేల కేసులు 19 మరణాలు నమోదు అయితే.. ఆదివారం నాటికి గంటకు 10 వేల 8వందల 95 కేసులు 62 మరణాలు రికార్డయ్యాయి.. సోమవారం నాటికి మరింత పెరిగి 11వేల 408 పాజిటివ్ కేసులు 67 మరణాలు నమోదయ్యాయి.. మంగళవారం గంటకు 73 మంది చనిపోయారు.

మంగళవారం కొత్తగా 2లక్షల 59వేల 170 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 53లక్షలు దాటింది. మరోవైపు యాక్టివ్ కేసులు 20 లక్షలు దాటాయి.. 24గంటల వ్యవధిలోనే 17వందల 61 మంది మరణించారు.. దీంతో వరుసగా 41వ రోజు కూడా యాక్టీవ్ కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 13.26 శాతానికి చేరగా రికవరీ రేటు 85.56 శాతానికి పడిపోయింది.

మహారాష్ట్ర, ఢిల్లీ సహా 10 రాష్ట్రాల్లోనే 77.67 శాతం కొత్త కేసు నమోదు అవుతున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ప్రస్తుతం 15.99శాతంగా ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, యూపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే 62.07శాతం కొత్త కేసులు నమోదవుతున్నాయి. పది రాష్ట్రాల్లోరు 82.74 శాతం కొత్త డెత్స్ రికార్డవుతున్నాయి. మంగళవారం మహారాష్ట్రలో 351 మంది, ఛత్తీస్‌గఢ్ లో 240 మంది చనిపోయారు.. ఇప్పటిదాకా 13కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ పూర్తియింది. మొత్తం డోసుల్లో 60శాతం 8 రాష్ట్రాల్లోనే పంపిణీ జరిగింది. 

Tags:    

Similar News