భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తునే ఉంది. ఇప్పటికే భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య 74 లక్షల 94 వేలు దాటాయి. గడచిన 24 గంటలలోనే దేశవ్యాప్తంగా 61,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా దేశవ్యాప్తంగా నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వైరస్ తో మొత్తం 1033 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1,14,031కు చేరింది. అదే విధంగా గడచిన 24 గంటలలో కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 72,614గా నమోదయింది.
దీంతో ఇప్పటి వరకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 65,97,209 కు చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 7,83,311గా ఉన్నాయి. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,70,173 టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 9,42,24,190 కు చేరింది. ఇక రికవరీ రేటు విషయానికొస్తే దేశంలో 88.03 శాతం ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 10.45 శాతంగా నమోదయింది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి మరణాల రేటు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపారు.