Tourist Places: చలి కాలంలో ఈ 5 ప్రదేశాలు సందర్శిస్తే మైమరచిపోతారు..!
* చలికాలం నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది
Tourist Places: శీతాకాలం అంటేనే కొంతమంది భయపడిపోతారు. చలితో వణికిపోవాల్సి ఉంటుందని ఆందోళన పడుతారు కానీ ఈ కాలంలో కొన్ని ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. చలికాలం నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఉత్తరభారతదేశంలో విపరీతంగా చలి పెరుగుతుంది. కానీ పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో చూడవలసిన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
1. జై సల్మేర్
ఇది ప్రసిద్ధ శీతాకాల విడిది. పర్యాటకులను తనవైపు ఆకర్షిస్తుంది. జైసల్మేర్‌ను గోల్డెన్ సిటీ అని కూడా అంటారు. ఇది థార్ ఎడారి మధ్యలో ఉంటుంది. ఈ ప్రదేశంలోని పట్వాన్ కి హవేలీ, సోనార్ ఫోర్ట్ , జైన్ టెంపుల్, జై సల్మేర్ కోట వంటి వాటిని సందర్శించవచ్చు.
2. ధర్మశాల
ధర్మశాల హిమాచల్ లోని ధౌలధర్ శ్రేణుల మధ్య ఉన్న ఒక ప్రాంతం. ఈ సుందరమైన హిల్ స్టేషన్ మీకు ఇండో-టిబెటన్ సంస్కృతిని తెలియజేస్తుంది. మీరు శీతాకాలంలో ఉత్తర భారతదేశాన్ని సందర్శించాలని అనుకుంటే ధర్మశాలని అస్సలు మిస్ కావొద్దు. శాంతి కోరుకునేవారికి, ట్రెక్కింగ్ చేయడానికి ఇది గొప్ప ప్రదేశం.
3. ఆగ్రా
ఆగ్రా తాజ్ మహల్ కు ప్రసిద్ధి. ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలలో ఇది ఒకటి. మీరు చలికాలంలో ఇక్కడ సందర్శించవచ్చు. ఇదొక చారిత్రక నగరం. మొఘలుల పాలన ఎక్కువగా ఇక్కడే ఉండేది. ఇక్కడ చాలా భవనాలను మొఘలులు నిర్మించారు.
4. జైపూర్
మీరు శీతాకాలంలో ఉత్తర భారతదేశంలోని జైపూర్ సందర్శించడానికి కూడా ప్లాన్ చేయవచ్చు. జైపూర్‌ని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. ఈ చారిత్రక ప్రదేశం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. మీరు గొప్ప జైన దేవాలయాలు , కోటల గొప్పతనాన్ని రాజరిక అనుభవాన్ని పొందవచ్చు.
5. శ్రీనగర్
శ్రీనగర్ భూమిపై స్వర్గం లాంటిది. ఈ ప్రదేశం అందాలను అనుభవించడానికి ప్రజలు ఇక్కడ సందర్శిస్తారు. సహజమైన మెరిసే దాల్ సరస్సు, అందమైన ఉద్యానవనాలు, సహజ సౌందర్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇది భారతదేశంలోని ఉత్తమ శీతాకాల గమ్యస్థానాలలో ఒకటి. శీతాకాలంలో హిమపాతాన్ని ఆస్వాదించడానికి డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.