UP Train Accident: వాహనాలపైకి దూసుకెళ్లిన రైలు: 5గురి మృతి
UP Train Accident: వాహనాలపైకి రైలు దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
UP Train Accident: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బుధవారం షాజహాన్‌పూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి. ఈ సమయంలో లక్నో-చండీఘట్ సూపర్‌ఫాస్ట్ ట్రైన్ వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో రైలు కూడా పట్టాలు తప్పిందని.. రెండు దిశల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని పోలీసుల వెల్లడించారు.
మీరన్పూర్ కత్రా రైల్వే స్టేషన్ దాటిన వెంటనే గెట్లు వేయాల్సి ఉంది. కానీ.. వేయకపోవడంతో.. ట్రైన్ క్రాసింగ్ దగ్గర రెండు ట్రక్కులు, ఒక కారు, మోటారుసైకిల్‌ను ఢీకొట్టింది. రైలు వస్తున్న క్రమంలో గేట్లు ఎలా తెరిచి ఉన్నాయో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని షాజహాన్‌పూర్ పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే.. రైల్వే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. చనిపోయిన వారికి 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.