Corona Cases in India: గడిచిన 24 గంటల్లో 47,092 కొత్త కేసులు
Corona Cases in India: ఇండియాలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
Corona Cases in India: దేశంలో మరోసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో కొత్త కేసులు 47 వేలు దాటగా మరణాలు కూడా 500 పైనే నమోదయ్యాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో ఉండటం రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అయితే కొత్త కేసుల్లో 70శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఒక్క కేరళలో 32 వేల 803 కొత్త కేసులు వెలుగు చూశాయి. మరోవైపు. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండటం కలవరపెడుతోంది. అంతేకాదు ఒక్క రాష్ట్రంలోనే 173 మరణాలు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 47 వేల 92 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. ఇదే సమయంలో 50*9 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4 లక్షల 39 వేలకు పైగా మందిని బలితీసుకుంది. ఇక నిన్న మరో 35 వేల 181 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.48 శాతంగా ఉంది.. కొత్త కేసులు పెరుగుతుండడంతో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ ఎక్కువవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 లక్షల 89వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.. యాక్టివ్ కేసుల రేటు 1.19 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియా కొనసాగుతోంది.