కరోనాతో చనిపోయే వారిలో ఎక్కువగా ఈ వయసు వారే!
COVID-19 deaths : భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ రేటు కూడా అంతే స్థాయిలో ఉండడం సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు..
COVID-19 deaths : భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ రేటు కూడా అంతే స్థాయిలో ఉండడం సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి 62లక్షల మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇదే అత్యదికమని అయన అన్నారు. మంగళవారం సాయింత్రం మీడియా సమావేశంలో మాట్లాడిన అయన, రోజువారీ పాజిటివిటీ రేటు 5.16శాతంగా ఉన్నట్టుగా తెలిపారు. అటు దేశవ్యాప్తంగా చూసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోనే యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువఫా ఉన్నట్టుగా అయన వెల్లడించారు.
అయితే కరోనా సోకి మరణించేవారిలో ఎక్కువగా 60 ఏళ్ళు పై బడిన వారేనని రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఇందులో 70 శాతం పురుషులు కాగా, 30శాతంగా మహిళలు ఉన్నట్టుగా తెలిపారు. ఇక 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 35శాతం, 26 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 10శాతం, 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కుల్లో 1శాతం, 17 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిలో 1శాతం మరణించినట్టుగా అయన వెల్లడించారు.
ఇక మంగళవారం నాటికి ఉన్న సమాచారం మేరకు కరోనా కేసులను ఒక్కసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 55342 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరుకుంది. తాజాగా కరోనాతో మరో 706 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,38,729 యాక్టివ్ కేసులు ఉండగా, 62,27,296 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక మరణించిన వారి సంఖ్య 1,09,856కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ ని విడుదల చేసింది.