Israel Pilgrimage: ఇజ్రాయెల్ లో తొక్కిసలాట, 44 మంది మృతి

Israel Pilgrimage: ఉత్తర ఇజ్రాయెల్ లో జరిగిన తొక్కిసలాటలో 38 మందికి పైగా యూదులు మరణించగా అనేకమంది గాయపడ్డారు.

Update: 2021-04-30 07:28 GMT

ఇజ్రాయెల్ లో తొక్కిసలాట, 44 మంది మృతి

Israel Pilgrimage: ఉత్తర ఇజ్రాయెల్ లో జరిగిన తొక్కిసలాటలో 38 మందికి పైగా యూదులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఇజ్రాయిల్ కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ల్యాగ్ బీఒమర్ పేరుతో ప్రతి సంవత్సరమూ స్థానికులు పెద్ద ఎత్తున మత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. యూదులకు ఇది అతి ముఖ్యమైన పండుగ.

'లాగ్ బొమర్ 'ఫెస్టివల్ సందర్భంగా 'పవిత్ర టోంబ్' వద్ద మూడు లక్షల మందికి పైగా యూదులు గుమికూడారు. వీరిలో వేలమంది ఇక్కడి ఓ స్టేడియంపైకి ఎక్కారని, అది ఒక్కసారిగా కుప్ప కూలిందని తెలిసింది. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. స్టేడియం నుంచి కిందికి దిగేందుకు వందలాది మంది ప్రయత్నించడంతో పెద్దఎత్తున తొక్కిసలాట జరిగినట్టు ఇజ్రాయెల్ స్టేట్ మీడియా తెలిపింది.

మృతదేహాలను అక్కడే తెల్లని టార్పాలిన్ తో కప్పారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఎమర్జెన్సీ, అత్యవసర సర్వీసులను వినియోగించినట్టు ఈ వార్తలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనను అత్యంత దారుణమైనదిగా పేర్కొన్నారు. హెవీ డిజాస్టర్ అని ఆయన అభివర్ణించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. యూదులు ప్రతి ఏటా ఇక్కడ పవిత్ర ' భోగి మంటల' వంటి మంటలు వేసి తమ సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనికి హాజరయితే శుభం జరుగుతుందని నమ్ముతారు.

Tags:    

Similar News