Varanasi: హిందువుల పవిత్ర నగరం వారణాసి.. అక్కడ ఈ ప్రదేశాలు అద్భుతం..

కాశీలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి

Update: 2021-12-14 07:00 GMT

హిందువుల పవిత్ర నగరం వారణాసి.. అక్కడ ఈ ప్రదేశాలు అద్భుతం..(ఫైల్ ఫోటో)

Best Places to Visit in Varanasi: హిందువుల పవిత్ర నగరం వారణాసి. దీనినే కాశీనగరం అని కూడా అంటారు. మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కాశీని సందర్శించాలని కోరుకుంటారు. కొంతమంది తన జీవితం ముగిసేలోపు ఒక్కసారైనా కాశీని సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అక్కడికి వెళ్లి పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్థాయని నమ్మకం. మరికొందరు కాశీలో ప్రాణాలు వదిలేయాలని కోరుకుంటారు. తన అంత్యక్రియలు అక్కడే జరగాలని ఆకాంక్షిస్తారు. అలాంటి కాశీలో సందర్శించడానికి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. కాశీ విశ్వనాథ దేవాలయం వారణాసిలో మీరు ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించవచ్చు. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం గురించి పవిత్ర గ్రంథాలలో కూడా ప్రస్తావించారు. ఈ ఆలయాన్ని ఒకసారి సందర్శించి పవిత్ర గంగానదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

2. మణికర్ణికా ఘాట్ ఈ ఘాట్ దహన సంస్కారాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వారణాసిలోని ప్రధాన ప్రదేశాలలో మణికర్ణికా ఘాట్ ఒకటి. అయితే ఈ ప్రదేశం కొంతమందికి నచ్చదు. కానీ ఈ ప్రదేశం చూడదగినది.

3. అస్సీ ఘాట్ అస్సీ ఘాట్ దగ్గర యాత్రికులు ఒక రావి చెట్టు కింద భారీ శివ లింగాన్ని పూజిస్తారు. ఈ ఘాట్ వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ ధార్మిక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ మీరు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను చూడవచ్చు. అక్కడి అందం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ సాయంత్రం హారతి ఇచ్చే పద్దతి మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తుంది.

4. తులసి మానస్ మందిర్ ఈ ఆలయానికి తనదైన ప్రత్యేకత ఉంది. హిందూ ఇతిహాసం రామాయణాన్ని తులసీదాస్‌ ఇక్కడే రచించాడని అంటారు. ఇది 1964లో తెల్లని పాలరాతితో నిర్మించారు. రామచరిత్మానస్ శ్లోకాలు, దృశ్యాలు ఆలయ గోడలపై చెక్కారు. ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News