Bogus Bank: బోగస్ బ్యాంకులు.. రూ.17 కోట్లకు బురిడీ.. ఎక్కడంటే..?

Bogus Bank: బోగస్ కంపెనీలు పెట్టి రుణాలు తీసుకొని పలు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన ఉదంతాలు మనం ఎన్నో చూశాం..

Update: 2023-05-22 13:15 GMT

Bogus Bank: బోగస్ బ్యాంకులు.. రూ.17 కోట్లకు బురిడీ.. ఎక్కడంటే..?

Bogus Bank: బోగస్ కంపెనీలు పెట్టి రుణాలు తీసుకొని పలు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన ఉదంతాలు మనం ఎన్నో చూశాం..కట్ చేస్తే కేటుగాళ్లు ఈసారి మరో అడుగు ముందుకేసి ఉతుత్తి బ్యాంకులను నెలకొల్పి కస్టమర్ల నుంచి కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘరానా మోసం ఉత్తరపద్రేశ్ రాష్ట్రం భాదోహిలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి నకిలీ బ్యాంకులను స్థాపించారు. అధిక రిటర్న్స్ ఆశచూపి పలువురు కస్టమర్లను తమ బ్యాంక్ ఖాతాదారులుగా మార్చుకున్నారు. భాదోహి జిల్లా వ్యాప్తంగా 38 బ్రాంచ్ లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి 17 కోట్లను లూఠీ చేశారు. ఈ కేసుకు సంబంధించి మాస్టర్ మైండ్స్ తో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బాదోహి జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. బీఎస్ ఎంజే క్వాశి బ్యాంక్ పేరిట బాదోహి జిల్లా వ్యాప్తంగా 38 బ్రాంచ్ లు నెలకొల్పి 17 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశారని ఎస్పీ తెలిపారు.

ఈ బోగస్ బ్యాంక్ వ్యవహారాన్ని మురారీ వెనకుండి నడిపించారని అశోక్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారని, రమేష్ బ్యాంక్ మేనేజర్ అవతారం ఎత్తి కస్టమర్లను బురిడీ కొట్టించినట్లు ఎస్పీ వివరించారు. నిందితుల వద్ద నుంచి 3 ఫోర్ వీలర్స్, 3 ల్యాప్ టాప్స్, 36 వేల నగదు, 53 స్టాంప్స్, 70 రిజిస్టర్స్, 618 పాస్ బుక్స్, రూ.67.25 లక్షల విలువ చేసే డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News