Corona Cases in India: బెంగళూరు, ముంబైలో మళ్లీ పెరుగుతున్న కొత్త కేసులు
Corona Cases in India: *బెంగళూరులో రోజుకు 200కు పైగా కొత్త కేసులు *ముంబైలో 136 శాతం పెరుగుదల
Corona Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గుదలతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసుల్లో 800 తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 3,714 కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృతిచెందారు. మరోవైపు యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 26 వేల 976 మంది బాధితులు కరోనాతో బాధపడుతున్నారు. ఇక బెంగళూరు, ముంబైలోనూ రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది.
బెంగళూరులో ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు ధరించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది.అలాగే, ప్రస్తుతం రోజుకు 16 వేల పరీక్షలు చేస్తుండగా దానిని 20 వేలకు పెంచాలని, ప్రైవేటు ల్యాబుల్లో రోజుకు 4 వేల మందికి పరీక్షలు చేయాలని సూచించింది. ఓవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంటే కేరళలో కొత్తగా నోరో వైరస్ కలకలం రేపుతోంది. తిరువనంతపురంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో కేంద్రం ఈ వైరస్ కేసులకు సంబంధించి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.