Central Government: 35 యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రంవేటు

Central Government: రెండు వెబ్ సైట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్, రెండు ట్విటర్‌ ఖాతాలు అకౌంట్‌పైనా కొరడా

Update: 2022-01-22 01:30 GMT

 35 యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రంవేటు

Central Government: నకిలీ.. ఫేక్ న్యూస్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న 35 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. రెండు వెబ్ సైట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్, రెండు ట్విటర్‌ ఖాతాలు, ఓ ఫేస్‌బుక్ అకౌంట్‌పైనా కొరడా ఝులిపించింది. వాటిని వెంటనే బ్లాక్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ వెల్లడించింది. ఈ ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల అకౌంట్లు, వెబ్ సైట్ లను పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ యూ ట్యూబ్ ఛానెళ్లకు మొత్తం 1.20 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని వీటిలో అప్ లోడ్ చేసిన వీడియోలకు 130 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయని కేంద్ర సమాచారా ప్రసార శాఖ తెలిపింది. ఇంటెలీజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. 

Tags:    

Similar News