Delhi: తనపై మొరిగిందని కుక్కతో సహా ముగ్గురిపై దాడి..

Delhi: ఢిల్లీ నగర వీధుల్లో మానవత్వం మంట గలిసింది చిన్న కారణానికే ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు.

Update: 2022-07-04 09:17 GMT

Delhi: తనపై మొరిగిందని కుక్కతో సహా ముగ్గురిపై దాడి.. 

Delhi: ఢిల్లీ నగర వీధుల్లో మానవత్వం మంట గలిసింది చిన్న కారణానికే ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. క్షణాల్లో వీధి వీధంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ఇంతటి విషాద పరిస్థితులకు కారణం ఢిల్లీలోని పశ్చిమ్‌ విహార్‌ ప్రాంతంలో ఓ పెంపుడు కుక్క ఎగబడిందన్న కారణంతో పక్కింటి వ్యక్తి వీరంగం వేశాడు. ఇనుప రాడ్డుతో పొరిగింటి వారిపై గొడవకు వెళ్లాడు. కుక్క బయటకు రాగానే తలపై రాడ్‌ తో ఒక్క వేటు వేశాడు అంతే క్షణాల్లో కుక్క ప్రాణాలు గాల్లో కలిసాయి.

ఇదేమని యజమాని అడుగుతుండగానే సేమ్‌ సీన్‌ ఇనుప రాడ్‌తో మోదడంతో ఒకే దెబ్బకు నేల కూలాడు. అతని పరిస్థితి విషమంగా మారింది. అంతలోనే అక్కడికి చేరుకున్న మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కాల్లు పట్టుకుని బతిమిలాడింది ఆమెను కూడా రాడ్‌తో ఇష్టంవచ్చినట్లు బాదడంతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కేసునమోదు చేసిన పోలీసులు దుండగుని కోసం గాలిస్తున్నారు.


Tags:    

Similar News