పంజాబ్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలింది. మొహాలిలోని డేరా బస్సీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ముగ్గురు కూలీలు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు. మూడు మృతదేహాలను బయటకు వెలికి తీసినట్లు మొహాలి డిప్యూటీ కమిషనర్ గిరీష్ దయాలన్ తెలిపారు. మృతి చెందిన వారిని గోపి, రాజు, రమేష్‌గా గుర్తించినట్లు అధికారి తెలిపారు. భవన యజమాని తలకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
సహాయక చర్యలు జరుగుతున్నాయి.. శిధిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో లేదో తెలుసుకోవడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం ప్రయత్నిస్తోంది. వారిని వెలికి తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం తెలిపింది. రెండవ అంతస్తులో నిర్మాణంలో ఉన్న దుకాణం పైకప్పు ఉదయం 9.30 గంటలకు ఒక్కసారిగా చీలిందని.. దాంతో భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. బిల్డింగ్ కూలిపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు.