మాజీ ముఖ్య‌మంత్రుల హౌజ్ అరెస్ట్‌

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు ఇతర నేతలను కొత్త ఏడాది తొలి రోజునే గృహ నిర్బంధం చేశారు.

Update: 2022-01-01 11:33 GMT

మాజీ ముఖ్య‌మంత్రుల హౌజ్ అరెస్ట్‌

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు ఇతర నేతలను కొత్త ఏడాది తొలి రోజునే గృహ నిర్బంధం చేశారు. వారి ఇళ్ల ముందు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై డీలిమిటేషన్‌ కమిషన్‌ ఇటీవల ముసాయిదా ప్రతిపాదనను విడుదల చేసింది. కశ్మీర్‌లోని ఒక స్థానానికి వ్యతిరేకంగా జమ్ము ప్రావిన్స్‌కు ఆరు అదనపు సీట్లను కమిషన్‌ ప్రతిపాదించింది.

అయితే పూర్వ రాష్ట్రంలోని రెండు ప్రావిన్సుల జనాభా నిష్పత్తికి విరుద్ధంగా ఉందని ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్‌ కూటమి ఆరోపించింది. డీలిమిటేషన్‌ కమిషన్‌ ముసాయిదా ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు ఇతర నేతల ఇళ్ల బయట పోలీసులు, భద్రతా ట్రక్కులను మోహరించారు.

Tags:    

Similar News