అమె వయస్సు 67 ఏళ్లు.. అతడి వయస్సు 28 ఏళ్లు.. సహజీవనం చేసేందుకు..

Love Story: అమె వయస్సు 67 ఏళ్లు.. అతడి వయస్సు 28 ఏళ్లు.. ప్రేమలో పడ్డారు.

Update: 2022-03-25 14:30 GMT

అమె వయస్సు 67 ఏళ్లు.. అతడి వయస్సు 28 ఏళ్లు..

Love Story: అమె వయస్సు 67 ఏళ్లు.. అతడి వయస్సు 28 ఏళ్లు.. ప్రేమలో పడ్డారు. సహజీవనానికి సిద్ధమయ్యారు. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఈ జంట నిరూపించింది. అంతేకాదు తమ బంధాన్ని గుర్తించాలంటూ గ్వాలియర్‌ జిల్లా కోర్టుకు నోటరీ కోసం వచ్చి అదరినీ షాక్‌కు గురిచేసిందీ జంట. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లా కైలారస్‌లో జరిగింది. ఇప్పుడు ఈ జంట గురించి ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆ జంట విషయమేమిటో ఇప్పుడు చూద్దాం.

మోరేనా జిల్లాలోని కైలారస్‌లో ఒకే ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల రాంకలి, 28 ఏళ్ల భోలు మధ్య ప్రేమ చిగురించింది. రెండు జనరేషన్ల మధ్య పుట్టిన ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఆ జంట తపిస్తోంది. వివాహం చేసుకోకుండానే కలిసి ఉండాలనుకుంటున్న ఆ జంట గ్వాలియర్‌ జిల్లా కోర్టును ఆశ్రయించింది. తమ సహజీవనానికి సంబంధించి నోటరీ చేయాలని కోరింది. ఈ విషయం తెలిసి స్థానికులు అవాక్కయ్యారు. అయితే తమ బంధంపై భవిష్యత్తులో ఎలాంటి గొడవలు రాకూడదని ఆ జంట భావించింది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా నోటరీ చేయించుకునేందుకు కోర్టుకు వచ్చినట్టు జంట తెలిపింది. సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నవారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా ఉండేందుకు సహజంగా ఇలాంటి నోటరీలు చేయించుకుంటారు. అయితే ఇలాంటి నోటరీలు అధికారికంగా చెల్లవని న్యాయనిపుణులు చెబుతున్నారు.



Tags:    

Similar News