విపక్షాల భేటీకి 26 పార్టీలు హాజరయ్యే ఛాన్స్.. హాజరుకానున్న మొత్తం 80 మంది నాయకులు
Opposition Meet In Bengaluru: సాయంత్రం బెంగళూరులో విపక్షాల డిన్నర్ మీటింగ్
Opposition Meet In Bengaluru: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్.. మరో కీలక భేటీకి సిద్ధమవుతోంది. సాయంత్రం బెంగళూరులో సిద్దరామయ్య నివాసంలో జరిగే డిన్నర్ మీటింగ్ లో విపక్ష పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యే అవకాశముంది. పాట్నా సమావేశంలో పాల్గొనని RLD, MDMK, KDMK, VCK, RSP, IUML, ఫార్వర్డ్ బ్లాక్ , కేరళ కాంగ్రెస్ పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమవేశాల్లో.. తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు... భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా.. ఆయా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు.
దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉండి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానికి సవాల్‌గా నిలుస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడు ఎవరనేది తగిన సమయంలో వెల్లడవుతుందన్నారు.