గ్యారపట్టిలో భారీ ఎన్‌కౌంటర్‌... సంబరాలు చేసుకుంటున్న సీ-60 కమాండో ఫోర్స్‌

Maoists: విజయంతో సంబరాలు చేసుకుంటున్న సీ-60 కమాండో ఫోర్స్‌

Update: 2021-11-14 14:42 GMT

C-60 కమాండో ఫోర్స్ (ఫైల్ ఇమేజ్)

Maoists: మహారాష్ట్ర గ్యారపట్టి ఎన్‌కౌంటర్‌లో పైచేయి సాధించినందుకు కమాండోలు సంబరాలు చేసుకుంటున్నారు. సీ-60 కమాండో ఫోర్స్‌ ధైర్యసహాసాలను జిల్లా ఎస్పీ గోయల్‌ కొనియాడారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది పురుషులు, ఆరుగురు మహిళ మావోయిస్టులు చనిపోయినట్లు వెల్లడించారు. నలుగురు జవాన్లకు గాయాలయ్యాయన్న ఎస్పీ గోయల్‌ ప్రస్తుతం కూంబింగ్‌ కొనసాగుతోందని తెలియజేశారు.

ఇక గ్యారపట్టి ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ ఎన్‌కౌంటర్‌ పచ్చిబూటకం అని ఆరోపించింది. ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. పోలీసులు ఇన్ఫార్మర్ల వ్యవస్థను పెంచిపోషిస్తున్నారని మండిపడింది. గ్యారపట్టి ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసింది.

శనివారం ఉదయం గ్యారపట్టి దగ్గర పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పక్కా ప్రణాళికతో కూంబింగ్‌కు వెళ్లిన మహారాష్ట్ర సీ-60 కమాండో ఫోర్స్‌ 26 మంది మావోయిస్టులను చంపేసింది. ఈ దాడుల్లో మావోయిస్టు అగ్రనేత మిలింద్‌ బాబూరావ్‌ హతమైనట్లు తెలుస్తోంది. మూడేళ్ల కిందట జరిగిన భీమా-కోరేగావ్‌ అల్లర్ల వెనుక తేల్‌ తుంబ్డే ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News